: ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ ను హత్య చేస్తామని హెచ్చరికలు!


ప్రముఖ రంగస్థల, సినీ నటుడు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ ను హత్య చేస్తామని 'ఇన్‌ టోలరెంట్ చంద్ర' అనే యూజర్ నేమ్‌ తో ట్విట్టర్‌ లో బెదిరింపు పోస్టింగ్ వచ్చింది. ఇప్పటికైతే, దీనిపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదని సమాచారం. తమకెవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఇటీవల ఆయన కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు టిప్పుసుల్తాన్ పేరు పెట్టాలని సూచించినందుకు, కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. హిందువులను, వక్కలిగ వర్గ ప్రజలను ఆయన అవమానించారని ఆరోపిస్తూ, కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఆపై గిరీష్ క్షమాపణలు చెప్పినప్పటికీ, చెలరేగిన వేడి ఇంకా చల్లారలేదు. తాజాగా ఆయన్ను హతమారుస్తామని హెచ్చరికలు వచ్చాయి.

  • Loading...

More Telugu News