: చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల సంయుక్త మీడియా సమావేశం?... భేటీలో కీలకంగా మంత్రి కామినేని


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల మధ్య నేటి మధ్యాహ్నం జరగనున్న భేటీ తర్వాత మరో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. విజయవాడలోని ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో జరగనున్న భేటీ తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. భేటీలో చర్చకు వచ్చిన అంశాలను వారిద్దరూ ఉమ్మడిగా మీడియాకు చెబుతారని తెలుస్తోంది. ఇక నేటి భేటీని ఖరారు చేయడంలో బీజేపీ నేత, ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించారట. రాజధాని శంకుస్థాపనకు పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. అయితే ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల మధ్య భేటీకి పలుమార్లు షెడ్యూల్ ఖరారైనా వివిధ కారణాలు అడ్డుగా నిలిచాయట. వీటన్నింటికీ చెక్ పెట్టేసిన కామినేని నేటి భేటీకి పక్కా ప్రణాళిక రచించారన్న ప్రచారమూ సాగుతోంది. అంతేకాక నేటి చంద్రబాబు, పవన్ ల భేటీలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News