: సరిహద్దుల్లో భారత్, పాక్ సైనికుల దీపావళి సంబరాలు
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో సైనికులు దీపావళి సంబరాలు చేసుకున్నారు. గత కొంత కాలంగా కాల్పులతో దద్దరిల్లిన సరిహద్దుల్లో దీపావళి సందడి కనిపించింది. పంజాబ్ లోని అమృత్ సర్ లోని అట్టారి సరిహద్దు వద్ద భారత్ కమాండెంట్ బిపుల్ బిర్ గుసేన్, పాకిస్థాన్ కమాండెంట్ బిలాల్ అహ్మద్ ఆధ్వర్యంలో ఇరుదేశాల సిబ్బంది మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం ఆలింగనాలు చేసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం భారత సైనికులు బాణాసంచా కాల్చి దీపావళి జరుపుకున్నారు.