: దలైలామా ఇంత వరకు సినిమాయే కాదు, కనీసం టీవీ కూడా చూళ్లేదు: కమలహాసన్
ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామాను కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో చోటు చేసుకున్న సంభాషణను కమల్ తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా అభిమానులకు తెలిపారు. దలైలామా ఇప్పటి వరకు సినిమాలే కాదు, కనీసం టీవీ కూడా చూడలేదని చెప్పారు. పురాతన కాలం నుంచి భారతదేశం ఇస్తున్న శాంతి సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయాలని ఆయన సూచించారని కమల్ తెలిపారు. దలైలామా చెప్పిన ఏన్నో విషయాలు తనను ప్రభావితం చేశాయని ఆయన చెప్పారు. దలైలామాను కలిసినప్పుడు కమల్ తో పాటు నటి గౌతమి కూడా వుంది.