: వన్డే క్రికెట్ నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్ స్టార్ ఆటగాడు
పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ యూనిస్ ఖాన్ అంతర్జాతీయ వన్డేల నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించాడు. 16 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పాకిస్థాన్ క్రికెట్ కు సేవలందించిన యూనిస్ ఖాన్ నేడు ఇంగ్లండ్ తో జరిగే వన్డే మ్యాచే చివరిదని ప్రకటించాడు. 264 వన్డేల్లో పాక్ కు ప్రాతినిధ్యం వహించిన యూనిస్ ఖాన్ 7,240 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 48 అర్ధసెంచరీలు కూడా ఉండడం విశేషం. పాకిస్థాన్ క్రికెటర్ గా యూనిస్ ఖాన్ టెస్టుల్లో నెలకొల్పిన రికార్డులు మరో క్రికెటర్ కు అనితర సాధ్యమైనవని విశ్లేషకులు పేర్కొంటారు. యూనిస్ రిటైర్మెంట్ పాక్ క్రికెట్ కు తీరని లోటని వెటరన్ లు పేర్కొంటున్నారు. కాగా, పాక్ క్రికెట్ లో షోయబ్ మాలిక్, యూనిస్ ఖాన్ ఇద్దరు క్రికెటర్లు ఒకే సిరీస్ లో రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం.