: దీపావళి ఇలా జరుపుకోండి...ప్రమాదాలకు దూరంగా ఉండండి
దీపావళి సందడిలో పిల్లల పాత్ర ప్రత్యేకం. బోలెడంత ఆనందంతో దీపావళి జరుపుకుంటారు. అయితే పిల్లలు సందడిలో ఉండగా వారిని కనిపెట్టుకుని ఉండాల్సిన బాధ్యత పెద్దలదేనని నిపుణులు సూచిస్తున్నారు. విశాలమైన ప్రదేశంలో శబ్ద తీవ్రత పెద్దగా లేని దేశీయ బాణాసంచా కాల్చడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని వారు చెబుతున్నారు. అలాగే బాణాసంచా కాల్చే ప్రదేశంలో రెండు బకెట్ల నీరు అందుబాటులో ఉంచుకోవాలని వారు సూచిస్తున్నారు. అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు అప్రమత్తమై వేగంగా స్పదించాలని వారు హెచ్చరిస్తున్నారు. పెంపుడు జంతువులను దూరంగా కట్టివేయాలని సూచిస్తున్నారు. శబ్దాల భయంతో అవి ఎదురుతిరిగే ప్రమాదం ఉండడంతో వాటిని దూరంగా ఉంచాలని ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు.