: సమంత విడుదల చేసిన నందినీ రెడ్డి సినిమా ఫస్ట్ లుక్


'అలా మొదలైంది' సినిమా ద్వారా సూపర్ హిట్టును సొంతం చేసుకున్న దర్శకురాలు నందినీ రెడ్డి తాజా సినిమా 'కళ్యాణ వైభోగమే' ఫస్ట్ లుక్ ను సినీ నటి సమంత ఫేస్ బుక్ ద్వారా విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆమె చెబుతూ, ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలా ముద్దొచ్చేలా ఉందని, ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొంది. కాగా, గతంలో నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'జబర్దస్త్' సినిమాలో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే సిద్ధార్థ్ తో సమంత ప్రేమలో పడిందంటూ వార్తలొచ్చాయి. కాగా, నందినీ రెడ్డి రూపొందిస్తున్న 'కళ్యాణ వైభోగమే' సినిమాలో నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News