: మూరత్ ట్రేడింగ్ కు రంగం సిద్ధం... రికార్డులపై మార్కెట్ వర్గాల ఆసక్తి


దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశీయ స్టాక్ మార్కెట్లలో నేడు మూరత్ (ముహూరత్) ట్రేడింగ్ జరగనుంది. కేవలం గంటపాటు సాగే ఈ ట్రేడింగ్ లో రికార్డు స్థాయి కొనుగోళ్లు జరుగుతాయి. దీపావళి పర్వదినాన కొనుగోలు చేసే షేర్లు లాభాలను ఆర్జించిపెడతాయన్న భావన సంప్రదాయ పెట్టుబడిదారుల్లో నెలకొన్న విషయం తెలిసిందే. అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించేందుకు బాంబే స్టాక్ ఎక్చేంజీ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్చేంజీ (ఎన్ఎస్ఈ)లు ఏర్పాట్లు చేశాయి. నేటి సాయంత్రం 5.45 గంటలకు ప్రారంభం కానున్న మూరత్ ట్రేడింగ్ 6.45 గంటలకు ముగుస్తుంది. లాభాల్లో దూసుకెళుతున్న సంస్థలకు చెందిన షేర్లను సంప్రదాయ గుజరాతీ పెట్టుబడిదారులు భారీగా కొనుగోలు చేయడం ఏటా జరుగుతున్నదే. ఈ ఏడాది ఏ ఏ కంపెనీ షేర్లను వారు కొనుగోలు చేస్తారు? ఏ స్థాయి రికార్డులు నమోదవుతాయన్న ఆసక్తికర చర్చకు మార్కెట్ వర్గాలు అప్పుడే తెరలేపాయి.

  • Loading...

More Telugu News