: హంద్రీ-నీవాకు గండి... లిఫ్ట్ మోటార్ల వైఫల్యమే కారణమట!


రాయలసీమలోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు గండి పడింది. సుదీర్ఘకాలంగా పనులు కొనసాగుతున్న ఈ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి ఇటీవలే పూర్తి చేసింది. ప్రాజెక్టులోని కాలువల ద్వారా నీటిని విడుదల చేసిన ప్రభుత్వం వందల ఎకరాలకు సాగు నీరందించింది. అయితే ‘ఎత్తిపోతల’ రకానికి చెందిన ఈ ప్రాజెక్టుకు ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. అడ్డంకులన్నిటినీ సరిచేసి ఇటీవలే గేట్లు ఎత్తేసిన అధికారులు నేటి ఉదయం మళ్లీ తల పట్టుకున్నారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు లిఫ్ట్ మోటార్లు విఫలమయ్యాయి. దీంతో నీటి ప్రవాహం ఎక్కువై మండలంలోని లక్కసారగం వద్ద ప్రాజెక్టు కాలువకు గండి పడింది. దీంతో లక్కసాగరం గ్రామానికి భారీగా వరద నీరు పోటెత్తింది. గ్రామం మొత్తం నీట మునిగింది. గ్రామ పరిధిలోని పంట పొలాలు కూడా మునిగిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడకు బయలుదేరారు. గండిని పూడ్చేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News