: ఇకపై అరగంట ముందు టికెట్ రిజర్వ్ చేసుకోవచ్చు: రైల్వే అధికారులు
రైలు బయలుదేరడానికి అరగంట ముందు వరకూ టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. నవంబర్ 12 నుంచి ఈ మార్పు అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి రిజర్వేషన్ చార్ట్ ను నాలుగు గంటల ముందు తయారుచేస్తారు. ఈ చార్ట్ ఆధారంగా ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవచ్చు. రెండో రిజర్వేషన్ చార్ట్ ను రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు తయారు చేసి, టికెట్ కలెక్టర్ కు అందిస్తామని రైల్వే శాఖ పేర్కొంది. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఈ మార్పులు చేశామని అధికారులు తెలిపారు.