: నా దీపావళి ఎలా ఉంటుందో తెలుసా?: ప్రభాస్
'బాహుబలి' ప్రభాస్ దీపావళి పండుగని ముందే చేసేసుకుని, దీపావళి ఎలా ఉంటుందో తెలుసా?...'యుద్ధం' అంత భయంకరంగా కాదు కానీ, సందడిగా ఉంటుందని చెబుతున్నాడు. దీపావళి వచ్చిందంటే సందడే సందడని అంటున్నాడు. తమ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దద్దరిల్లిపోవాల్సిందే అని అంటున్నాడు. కొత్తగా పెళ్లి చేసుకున్న బంధువులు, స్నేహితులను దీపావళికి ఆహ్వానించడం సంప్రదాయమని, వారు ప్రేమగా జాగ్రత్తగా ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ దీపావళి చేసుకుంటుంటే వారి వెనుక పెద్ద శబ్దంతో బాంబులు పేల్చి వారిని భయానికి గురిచేసి, అతుక్కుపోయేలా చేసి వారి మధ్య మరింత ప్రేమను పెంచుతామని ప్రభాస్ తెలిపాడు. ఓ సారి దీపావళికి తమ ఇంటికి వచ్చిన ప్రముఖ దర్శకుడు మెహర్ రమేశ్ 'మీరు పెద్ద టెర్రరిస్టుల్లా ఉన్నారే?' అని ఆశ్చర్యపోయారని ప్రభాస్ గుర్తు చేసుకున్నాడు. దీపావళి రోజు కొత్త వారు తమ ఇంటికొస్తే భయపడిపోవడం ఖాయం అని ప్రభాస్ ముందే భయపెట్టేస్తున్నాడు. సంక్రాంతి, హోలీ తరువాత అంతటి స్థాయిలో ఆనందం పంచే దీపావళి అంటే భలే ఇష్టం అంటున్నాడు ప్రభాస్.