: ఇంట్లో వాళ్లకే ఝలక్ ఇచ్చిన యూపీ యువతి!


స్నేహితులు, తెలిసినవారిని ఏమార్చి పరారవ్వడం సర్వసాధారణం. కానీ ఉత్తరప్రదేశ్ లో ఓ యువతి ఇంట్లోవారికే బురిడీ కొట్టి పరారైంది. వివరాల్లోకి వెళ్తే...ఫిరోజాబాద్ కు చెందిన యువతి సరిత కుటుంబ సభ్యులందరికీ మత్తు మందును కలిపిన పానీయం ఇచ్చింది. వారంతా నిద్రలోకి జారుకున్న తరువాత 20 లక్షల విలువైన నగలు, నగదు, ఇంట్లో ఉన్న తుపాకీ తీసుకుని పరారైంది. మత్తులోకి జారుకున్న కుటుంబ సభ్యులు తెల్లవారి లేచి చూసేసరికి కుమార్తె సరితతో పాటు నగదు, నగలు, తుపాకీ కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సరిత పారిపోయేందుకు గల కారణాలు విశ్లేషిస్తున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News