: ఇదొక 'వేలం'వెర్రి ముచ్చట!
అమెరికాలోని న్యూయార్క్ లో నిర్వహించిన ఓ వేలం పాటలో ఓ న్యూడ్ పెయింటింగును రికార్డు ధరకు దక్కించుకుని ఓ రసజ్ఞుడు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. చైనాకు చెందిన ఆ వ్యక్తి ఈ న్యూడ్ పెయింటింగ్ ను 170.4 మిలియన్ డాలర్లకు (అంటే భారతీయ కరెన్సీలో 1131 కోట్ల రూపాయలకు) కొనుగోలు చేశాడు. రాయ్ లిచ్ టెన్ స్టిన్ గీసిన ఈ మోడీగ్లియానీ న్యూడ్ కళాఖండానికి 100 మిలియన్ డాలర్లు రావచ్చని వేలం నిర్వాహకులు భావించగా, రికార్డు ధరతో ఇది అమ్ముడుపోయింది. ప్రపంచంలో రెండో అత్యధిక ధరకు అమ్ముడైన కళాఖండంగా ఇది ఇప్పుడు రికార్డు పుటలకెక్కింది.