: కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై సమగ్ర విచారణ జరపాలి: మధుయాష్కీ
టీఆర్ఎస్ పాలన మొత్తం అవినీతిమయమేనని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆరే అవినీతిలో కూరుకుపోయారని మండిపడ్డారు. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, సింగరేణి ఉద్యోగ నియామకాల్లో భారీ అవినీతి జరిగిందని అన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి ఎలా వెళతారని ప్రశ్నించారు. ప్రజాకోర్టులో అవినీతిని బట్టబయలు చేస్తామని చెప్పారు.