: 15 సెక్టార్లలో 100 శాతం ఎఫ్ డీఐలకు కేంద్రం అనుమతి
కేంద్ర ప్రభుత్వం సంస్కరణలపై ముందడుగు వేసింది. వంద శాతం ఎఫ్ డీఐలకు కేంద్రం అనుమతి తెలిపింది. మొత్తం 15 ప్రధాన సెక్టార్లలో ఎఫ్ డీఐ నిబంధనలను సడలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలుపుతూ, పరిమితిని రూ.3వేల కోట్ల నుంచి రూ.5వేల కోట్లకు పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. రైల్వే, రక్షణ, విమానయానం, నిర్మాణ రంగం, ప్రసార మాధ్యమాలు, హెల్త్ సెక్టార్లు తదితర రంగాల్లో ఎఫ్ డీఐలకు ఆమోదం తెలిపింది. ఇందులో వార్తా చానెళ్లలో 26 నుంచి 49 శాతం ఎఫ్ డీఐ పెంచింది.