: కేసీఆర్ పై ఎన్నికల ప్రధానాధికారికి టి.కాంగ్రెస్ ఫిర్యాదు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై టి.కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఆయనను కలసిన కాంగ్రెస్ నేతలు, వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసేలా సీఎం వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ పోలీస్ ఉద్యోగాల దరఖాస్తులకు అభ్యర్థుల వయసును సడలిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని టి.కాంగ్రెస్ నేతలు భన్వర్ లాల్ ను కోరినట్టు తెలుస్తోంది.