: మోదీ, నితీశ్ విజయాల వ్యూహకర్తతో మమతా బెనర్జీ భేటీ?


నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ విజయం సాధించారు. ఆ విజయాల వెనుక ఉన్న కీలక వ్యక్తి పేరు ప్రశాంత్ కిషోర్. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ విజయానికి కూడా ఆయనే కారకుడు. ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా మంచిపేరు సంపాదించుకున్న ప్రశాంత్ కిషోర్ తో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ వారం తర్వాత వారి భేటీ ఉండవచ్చని పార్టీ వర్గాళు చెబుతున్నాయి. వచ్చే ఏడాదిలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్ల నాడి పట్టుకునేందుకు అవసరమైన టిప్స్, ప్రచార వ్యూహాలపై ప్రశాంత్ కిషోర్ తో మమతా బెనర్జీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా, 37 ఏళ్ల ప్రశాంత్ ఉన్నత విద్యావంతుడు. ఓటర్లను బుట్టలో పడేసేందుకు ఆయన తన టీమ్ తో కలిసి రూపొందించిన ఎన్నికల ప్రచార వ్యూహాలు ఎన్నో విజయవంతమయ్యాయి. బీహార్ ఎన్నికల్లో 'పర్చా పే చర్చా' కార్యక్రమం ఎంతగా ఓటర్లను ఆకట్టుకుందో తెలిసిన విషయమే.

  • Loading...

More Telugu News