: లీటర్ పెట్రోలు వాస్తవ ధర మీకు తెలుసా?...అయితే ఈ నిజం తెలుసుకోండి!


పెట్రోల్, డీజిల్ ధరల పెంపులో తమ ప్రమేయం ఏదీ లేదని, కేవలం పెట్రోలియం కంపెనీలే ఈ ధరవరలను నిర్ణయిస్తాయని కేంద్రం నంగనాచి కబుర్లు చెప్పడం వాహనదారులకు బాగా తెలుసు. అయితే ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ ధరల అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకుల వల్ల కనిష్ఠ స్థితికి చేరుకున్నాయి. భారత్ లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పు లేదు. ఎందుకంటే... వాస్తవంగా పెట్రోలు లీటర్ ఉత్పత్తి చేసేందుకు అయ్యే ధర కేవలం రూ. 24.75 పైసలు. రవాణా ఖర్చులు, ఉద్యోగుల నిర్వహణ, లాభాలను కలుపుకుని అంతర్జాతీయంగా లీటర్ పెట్రోలు ధర రూ. 27.74 పైసలు. దీనిపై డీలర్ కమీషన్ రూ. 2.26 పైసలు అంటే లీటర్ పెట్రోలు 30 రూపాయలు అవుతుంది. దీనిపై కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం రూ.19.06 పైసలు, వ్యాట్, రాష్ట్రం విధించే సుంకం రూ. 12.14 పైసలు. ఇవన్నీ కలుపుకుని వినియోగదారుడి దగ్గరకు వచ్చే సరికి లీటర్ పెట్రోలు ధర రూ. 61.20 పైసలు అవుతుంది. పెట్రోలియం కంపెనీల యాజమాన్యాలు ధరలను తగ్గించినా కేంద్రం, రాష్ట్రాలు పన్నులను మాత్రం సమీక్షించవు. దీంతో అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రోలు ధరలు ఎంత దిగువకు చేరుకున్నా భారతదేశంలో మాత్రం కిందికి దిగిరావు.

  • Loading...

More Telugu News