: సీమ వాసులకు కావాల్సింది చంద్రబాబు కాకమ్మ కథలు కాదు: బైరెడ్డి
రాయలసీమకు స్థానిక నేతలే అన్యాయం చేశారంటూ ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఆరోపించడంపై రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి స్పందించారు. సీమకు జరిగిన అన్యాయంపై సీఎంతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీమ వాసులకు కావాల్సింది చంద్రబాబు కాకమ్మ కథలు కాదని, సాగునీరని చెప్పారు. కర్నూలులో ఈ మేరకు విలేకరులతో బైరెడ్డి మాట్లాడారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని చంద్రబాబు ఉల్లంఘించారని ఆరోపించారు. 120 జీవోను అమలు చేసి సీమ విద్యార్థులకు మెడికల్ సీట్లు రాకుండా చేసిన బాబు, మరోపక్క తాను సీమ బిడ్డనని చెప్పుకోవడం సిగ్గు చేటుగా ఉందన్నారు.