: తిరుమల 2వ ఘాట్ రోడ్ లో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది: టీటీడీ ఈవో
తిరుమలలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా 2వ ఘాట్ రోడ్ లో 16వ కిలో మీటర్ దగ్గర పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. రోడ్డు కుంగిపోయే పరిస్థితి ఉందని చెప్పారు. నిపుణులతో పరిశీలించి మరమ్మతులు చేపడతామన్నారు. అప్పటివరకు వాహనాలను లింకు రోడ్డు ద్వారా మళ్లిస్తామని ఈవో చెప్పారు. మరోవైపు తిరుమలలో కొండచరియలు పడే ప్రాంతాల్లో సిబ్బందిని నియమించి టీటీడీ అధికారులు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. కనుమ రహదారుల్లో క్రేన్లు, ప్రొక్లెయిన్లు సిద్ధంగా ఉంచారు. రహదారిలో పడిన కొండచరియలు, చెట్లను తొలగిస్తున్నారు.