: ఫేస్ బుక్ నుంచి కొత్త ఫీచర్ !
ఫేస్ బుక్ మెసెంజర్ వినియోగదారులు ఇంతకుముందుకన్నా మరింత స్పీడ్ గా తమ ఫొటోలను ఇతరులతో షేర్ చేసుకునే అవకాశం ఆ సంస్థ కల్పించింది. ‘ఫొటో మ్యాజిక్’ అనే కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లకే కాకుండా ఐఓఎస్ వాడుతున్న వారికి కూడా ఈ కొత్త ఫీచర్ ను అందించనున్నట్లు ఫేస్ బుక్ ప్రతినిధులు వెల్లడించారు. మెసెంజర్ యాప్ ను ఓపెన్ చేయకుండానే డివైస్ లోని గ్యాలరీలో ఉన్న ఫొటోలను ఈ ఫీచర్ స్కానింగ్ చేసుకుని వాటిల్లో ఉన్న యూజర్ స్నేహితులను గుర్తిస్తుంది. ఆ తర్వాత వీటిని ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. అయితే, ప్రస్తుతానికి ఈ కొత్త ఫీచర్ ఆస్ట్రేలియాలోని యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చామని ఫేస్ బుక్ యాజమాన్యం తెలిపింది. కాగా, ఫొటో మ్యాజిక్ ఫీచర్ ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఫేస్ బుక్ ప్రతినిధులు చెప్పారు. అంటే, త్వరలో ఇదే ఫీచర్ ను ఇండియాలోని నెటిజన్లు కూడా ఆస్వాదించవచ్చు.