: కడలూరు వద్ద ఘోర విషాదం... ఊహించని నది వరదకు 10 మంది మృతి
ఓ వైపు భారీ వర్షం. ఎటెళ్లాలో తెలియని పరిస్థితి. దిక్కుతోచక ఉన్న ఆ పేదల ఇళ్లపైకి కాట్టారు నది రూపంలో మృత్యువు వచ్చి పడింది. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే 10 మంది మృత్యువాత పడ్డారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాట్టారు నదిలో ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ, ఆ నీరు సముద్రంలోకి చేరే దారిలో నదిలోకి రాగా, వరద ఉద్ధృతి పెరిగినట్టు తెలుస్తోంది. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు మృతదేహాలను వెలికితీసేందుకు చర్యలు ముమ్మరం చేశారు.