: నటితో అసభ్య ప్రవర్తన... క్షమాపణ చెప్పిన కపిల్
'కామెడీ నైట్స్ విత్ కపిల్' అనే కార్యక్రమంతో పాప్యులర్ అయి, స్టార్ హోదా సంపాదించుకున్న కపిల్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. మరాఠీ నటి దీపాలితో అసభ్యంగా ప్రవర్తించి, విమర్శల పాలయ్యాడు. ఇంటర్నేషనల్ మరాఠి ఫెస్టివల్ అవార్డ్స్ - 2015 పార్టీ సందర్భంగా మద్యం సేవించినట్టు కనబడ్డ కపిల్ శర్మ... పలువురు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో, తనతో డ్యాన్స్ చేయాలంటూ నటి దీపాలిని బలవంతపెట్టాడు. దీనిపై దీపాలి స్పందిస్తూ, "నాతో డ్యాన్స్ చేయాలని ఉందని కపిల్ అన్నాడు. నేను కుదరదని చెప్పాను. కపిల్ ఎవరో కూడా నాకు తెలియదు. నాకు తెలిసిన వ్యక్తులతోనే నేను డ్యాన్స్ చేస్తా" అని చెప్పింది. ఏదేమైనప్పటికీ, జరిగిన దానికి కపిల్ శర్మ ట్విట్టర్లో క్షమాపణ చెప్పాడు. తాను కూడా మనిషినేనని, తప్పులు చేయడం మనిషికి సహజమని చెప్పాడు.