: నితీశ్ ‘మూడో’ ప్రమాణానికి మూహుర్తం ఖరారు...ఈ నెల 20న పాట్నాలో వేడుకగా కార్యక్రమం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి షాకిచ్చిన మహా కూటమి ఘన విజయం సాధించిన సంగతి విదితమే. మూడింట రెండొంతుల సీట్లను కైవసం చేసుకున్న మహా కూటమిలోని ప్రధాన పార్టీ జేడీయూ నేత, ప్రస్తుత ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ వరుసగా మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 20న బీహార్ రాజధాని పాట్నాలో వేడుకగా జరగనున్న కార్యక్రమంలో నితీశ్ కుమార్ సీఎంగా పదవీ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలను పెద్ద సంఖ్యలో ఆహ్వానించేందుకు మహా కూటమిలోని మరో ప్రధాన పార్టీ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సన్నాహాలు చేస్తున్నారు.