: బైక్ పై వచ్చి బాలీవుడ్ నటి ఫోన్ కొట్టేశారు
బైక్ పై వచ్చిన దుండగులు బాలీవుడ్ నటి ఫోన్ కొట్టేసిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ముంబైలోని సబర్బన్ మలద్ ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్ కు బాలీవుడ్ నటి అర్షిఖాన్ వెళ్లింది. షాపింగ్ మాల్ నుంచి బయటకు వచ్చి, ఆమె తన కారు వద్దకు వెళుతుండగా, బైక్ పై వేగంగా వచ్చిన దుండగులు ఆమె ఫోన్ లాక్కుని పారిపోయారు. దీంతో ఆమె బంగుర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. తన ఫోన్ విలువ 55 వేల రూపాయలని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. కాగా, అర్షిఖాన్ అంటే ఆ మధ్య పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో అక్రమ సంబంధం ఉందని చెప్పిన నటి!