: స్వాతంత్ర్య సమరయోధురాలికి పట్టం కడుతున్న మయన్మార్ ప్రజలు


మయన్మార్ లో ప్రజాస్వామ్య బద్ధమైన ప్రభుత్వ ఏర్పాటు కోసం ఏళ్ల తరబడి స్వాతంత్ర్య పోరాటంలా ఉద్యమించిన ఆంగ్ సాన్ సూకీకి అక్కడి ప్రజలు పట్టం కడుతున్నారు. నిన్న జరిగిన ఎన్నికల ఫలితాలు ఇప్పుడు వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకు వెల్లడించిన ఫలితాల ప్రకారం ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ పార్టీ తొలి రౌండ్ ను క్లీన్ స్వీప్ చేసింది. మయన్మార్ లోని పెద్ద నగరమైన యాంగాన్ లో ఉన్న 12 సీట్లను ఆంగ్ సాన్ సూకీ ఎన్ఎల్డీ గెలుచుకుంది. మిగిలిన నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కాగా, గత ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ పూర్తి స్థాయి మెజారిటీ లభించని కారణంగా ఆమె పార్టీ ప్రతిపక్షహోదా సంపాదించుకుంది. అయినప్పటికీ ఆమె కొంత కాలం గృహ నిర్బంధంలోనే ఉన్నారు. తాజా బలగాల నియంత్రణలో మయన్మార్ కు స్వేచ్ఛ లేదని ఆమె గొంతెత్తి నినదించారు. నియంతృత్వానికి తమ దేశంలో చోటు లేదని పోరాడారు. ఆమె పోరాటం ఇన్నాళ్లకు పూర్తి స్థాయిలో ఫలించనుంది. ఆమె కల ఇన్నేళ్లకు సాకారం కానుంది.

  • Loading...

More Telugu News