: ఇదో చిత్రం...ఉగ్రవాదుల్లో కూడా చీలిక వచ్చింది!
వారి నినాదం జీహాద్... వారి పోరాటం వ్యక్తిగత శత్రువులు, ముస్లిం వ్యతిరేకులను అంతమొందించడం. లక్ష్యం ఇస్లాం రాజ్యస్థాపన. పై స్థాయి కమాండర్ల ఆదేశాలకు అనుగుణంగా ఇతర దేశాలు, ఇతర ప్రాంతాలపై దాడులకు దిగి, తమ ప్రభావానికి లోను కానివారిని, తమకు లొంగని వారిని అంతమొందించడం వారి పని. అయితే అధికారానికి ఎవరూ అతీతులు కారని తాలిబన్లు నిరూపించారు. తాలిబన్ అగ్రనాయకత్వంలో విభేదాలు బహిర్గతమయ్యాయి. ముల్లా ఒమర్ స్థానంలో ఎంపికైన ప్రస్తుత తాలిబన్ల నేత ముల్లా అఖ్తర్ మొహమూద్ మన్సూర్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయినట్టు తెలుస్తోంది. ముల్లా ఒమర్ స్థానంలో వచ్చిన మున్సూర్ అంత సమర్థుడు కాదని, అతని కంటే ముల్లా ఒమర్ సన్నిహితుడు ముల్లా మహ్మద్ రసోల్ ను మాత్రమే తాము ఆమోదిస్తామని కొందరు ఉన్నత స్థాయి కమాండర్లు పేర్కొంటున్నారు. దీంతో తాలిబన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆ విభేదాల కారణంగా అక్కడ ఘర్షణ కూడా చోటుచేసుకున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే ప్రభుత్వ బలగాలు ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లను అణచివేయడం పెద్ద కష్టం కాదు.