: ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా 'రిజెక్టెడ్ పీపుల్'!: జేసీ సంచలన వ్యాఖ్యలు


రాజకీయాల్లో ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా 'రిజెక్టెడ్ పీపుల్' (తిరస్కరణకు గురైనవారు) అని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బీహార్ లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అభిప్రాయపడ్డారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు తప్ప ప్రజలకు నిజాలు చెప్పడానికి ఏ రాజకీయ నాయకుడికి ధైర్యం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల్లో ప్యాకేజీతో, విభజన వాదంతో గెలిచేస్తామని భావించిన వారికి ప్రజలు సరైన బుద్ధి చెప్పారని ఆయన తెలిపారు. రాజకీయ నాయకులు ఎవరికీ వాస్తవాలతో ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదని అన్నారు. ప్రజలేమన్నా వెర్రోళ్లా? రాజకీయ నాయకులు ఏది చెబితే అది నమ్మేయడానికి? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు ఇప్పుడు బాగా అవగాహన ఏర్పడిందని, ఎవరిని ఎన్నుకోవాలో వారికి బాగా తెలుసని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపై లేనిపోని మాటలు చెప్పకుండా నిజాయతీగా ఉండాలని ఆయన సూచించారు. నితీశ్ కుమార్, లాలూ లను బీహార్ ప్రజలు విశ్వసించారని ఆయన పేర్కొన్నారు. తమ ముఖ్యమంత్రికి అంతా తెలుసని, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఆయన అంతా కరెక్టుగా చేస్తారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News