: సింహాచలంలో సినీ దర్శకుడు వీవీ వినాయక్


విశాఖపట్టణం జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కినేని అఖిల్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'అఖిల్' చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేసేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలో విడుదల కానున్న అఖిల్ చిత్రం విజయం సాధిస్తుందని, ఇది అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని అన్నారు. వినాయక్ తో పాటు సినీ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News