: నన్ను గెలిపించి సీఎంకు కానుకగా ఇవ్వండి: టీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థి


వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్, ఆ పార్టీ నేతల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇవాళ వరంగల్ చౌరస్తాలో దయాకర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ లు ప్రచారం చేశారు. స్థానికుడైన తనను గెలిపించి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇవ్వండని ఈ సందర్భంగా పసునూరి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, బంగారు తెలంగాణ టీఆర్ఎస్ తోనే సాధ్యమని తెలిపారు. అయితే ప్రతిపక్షాలకు వరంగల్ లో ఎవరూ లేరన్నట్టు అమెరికా, హైదరాబాద్ నుంచి అభ్యర్థులను దిగుమతి చేసుకున్నారని పసునూరి విమర్శించారు.

  • Loading...

More Telugu News