: 200 ఏళ్ల నాటి కాళీమాత బంగారు విగ్రహం చోరీ
రెండు వందల సంవత్సరాల నాటి పురాతన కాళీమాత విగ్రహం ఒకటి చోరీకి గురైంది. అసోంలోని కామరూప్ జిల్లా స్థానిక జయంతిపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాళీ ఆలయం తలుపులు బద్దలు కొట్టి దుండగులు అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించినట్టు పోలీసులు తెలిపారు. విగ్రహం పూర్తిగా బంగారంతో తయారుచేసిందని, దాని విలువ రూ.2 కోట్లు ఉంటుందని ఆలయ నిర్వాహకులు చెప్పారు. ఘటనపై ఆలయ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దుండగుల కోసం గాలిస్తున్నారు.