: జైలు నుంచి పోటీ చేసినా... బీహార్ ఎన్నికల్లో సత్తా చాటాడు!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పలు ప్రత్యేకతలున్నాయని చెప్పాలి. అందులో ఒకటి జేడియూ మాజీ నేత అనంత కుమార్ సింగ్ అలియాస్ చోటే సర్కార్ విజయం సాధించడం. ఇందులో విశేషమేంటంటే... కిడ్నాప్, హత్యలు, అత్యాచారాల కేసులో ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. అప్పటికే ఎమ్మెల్యే అయిన అనంత సింగ్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు వదలని విక్రమార్కుడిలా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జేడియూ అభ్యర్థి నీరజ్ కుమార్ ను కంగు తినిపించాడు. మోకామా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి 18,348 ఓట్ల మెజారీటీతో గెలుపొందాడీ చోటే సర్కార్. మొత్తం ఓట్లలో అనంత సింగ్ కు 54,005 ఓట్లు రాగా, జేడియూ అభ్యర్థికి 35,657 ఓట్లు వచ్చాయి.