: అంబర్ పేట పోలీస్ లైన్స్ లో మిస్ ఫైర్... హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం


హైదరాబాదులోని అంబర్ పేట పోలీస్ లైన్స్ లో నేటి ఉదయం విషాదం నెలకొంది. పొరపాటుగా పేలిన తుపాకీ ఓ హెడ్ కానిస్టేబుల్ ను పొట్టనబెట్టుకుంది. సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో చోటుచేసుకున్న మిస్ ఫైర్ లో అక్కడ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న షేక్ ఖాజా మొయినుద్దీన్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈయన స్వస్థలం నల్లగొండ జిల్లాలోని వలిగొండ. ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అసలు తుపాకీ పేలిన కారణాలపై వారు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News