: ‘కమల’ దళం ఓటమికి సవాలక్ష కారణాలు!


బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయానికి కలిసొచ్చిన అంశాలు ముఖ్యంగా జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ఒకే గొడుగుకిందకు రావడం, బీజేపీ విధానాలు, స్థానికత మొదలైన అంశాలు ఆ కూటమికి ‘మహా’ విజయాన్ని దక్కించాయి. ఇక, ఎన్డీయే కూటమి ఓటమిపాలవడానికి పలు కారణాలు ఉన్నాయి... జేడీ(యూ), ఆర్జేడీ లు కూటమిగా ఏర్పడటం ప్రధాన కారణం. ఆ కూటమిలో కాంగ్రెస్ పార్టీ ని కూడా చేర్చుకోవడం మరో కారణం. దీంతో ఎన్డీఏ వ్యతిరేక ఓటు చీలిపోకుండా నితీశ్-లాలూ కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సున్నితమైన రిజర్వేషన్ల అంశంపై కొందరు నేతల వ్యాఖ్యలను మహా కూటమి నేతలు ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల పంపిణీ అంశం వివాదాస్పదమవ్వడం, దీనిపై సొంత పార్టీ ఎంపీలు శత్రుఘ్న సిన్హా, ఆర్కే సింగ్ అసమ్మతి వెళ్లగక్కడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల అంశం, బీజేపీ తమ పార్టీ తరఫు నుంచి సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం వంటి అంశాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఓటమి పాలవ్వడానికి కారణాలుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News