: బలపడనున్న అల్పపీడనం... ప్రజల అప్రమత్తత!
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారిందని, వచ్చే 24 గంటల్లో మరింత బలపడతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో కోస్తాంధ్రలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. చెన్నైకి దక్షిణాన 448 కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైంది. రేపు రాత్రి చెన్నై-కారేకాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉండటంతో చెన్నైకి తుపాను హెచ్చరికలు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలోని తీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.