: కేంద్రం సహకారం ఎంతో అవసరం: నితీశ్ కుమార్
బీహార్ అభివృద్ధికి కేంద్ర సహకారం ఎంతో అవసరమని జేడీ(యు)అధినేత నితీశ్ కుమార్ అన్నారు. పాట్నాలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రంతో సానుకూలంగా పనిచేయాలన్నదే తమ అభిమతమని, ప్రధాని తనకు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు చెప్పారని, ఇది చాలా శుభపరిణామమని అన్నారు. కూటమి నిర్ణయాలకు అనుగుణంగా నిబద్ధంగా పనిచేశామని నితీశ్ చెప్పారు. ఎన్నికల ప్రణాళికను ఉమ్మడిగానే ప్రకటించామని, అదే విధంగా కలిసి పనిచేస్తామన్నారు. అయితే, తాము ఏ ఒక్కరికీ వ్యతిరేకంగా ఎప్పటికీ పనిచేయమన్నారు. అందరి సమ్మతి, సహకారంతోనే తమ ప్రభుత్వాన్ని నడుపుతామని, విపక్షాన్ని కూడా సమ్మిళతం చేసుకునే ముందుకెళ్తామని నితీశ్ కుమార్ పేర్కొన్నారు.