: వరుస విజయాలతో ‘నితీశ్’ హ్యాట్రిక్!


బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి సంపూర్ణ విజయం దిశగా దూసుకుపోతోంది. జేడీ(యు) అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని మళ్లీ అధిష్టించనున్నారు. దాదాపు పదేళ్లు బీహార్ ను పాలించిన నితీశ్ కుమార్ ఈ ఎన్నికల్లో విజయం సాధించడంతో వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. గతంలో ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భాల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆర్జేడీ అధినేత లాలూపై విజయం సాధించారు. ఈసారి లాలూ పార్టీతో, కాంగ్రెస్ లతో పొత్తు పెట్టుకుని మళ్లీ విజయం పొందారు. గతంలో ఆయన సాధించిన విజయాలు... * 2000 మార్చి 3 నుంచి మార్చి 10వ తేదీ వరకు కేవలం 7 రోజులు సీఎం పదవిలో ఉన్నారు. ఆ తర్వాత లాలూ భార్య రబ్రీదేవి అధికారంలోకి వచ్చింది. * 2005 నవంబరు 24 నుంచి 2010 నవంబరు 24 వరకు నితీశ్ ముఖ్యమంత్రిగా పూర్తి కాలం పదవిలో కొనసాగారు. * 2010 ఎన్నికల్లో నితీశ్ విజయం సాధించడంతో నవంబరు 26 నుంచి 2014 మే 17 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. * 2014 సాధారణ ఎన్నికల్లో బీహార్ లోక్ సభ సీట్లలో ఎక్కువ శాతం బీజేపీ తీసుకుంది. దీంతో రాష్ట్రంలో జేడీ(యూ) ఓటమికి బాధ్యత వహిస్తూ 2014లో బీహార్ సీఎం పదవికి నితీశ్ రాజీనామా చేయడం, జితన్ రామ్ మాంఝీని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించడం తెలిసిందే. అనంతరం జరిగిన పరిణామాలతో మాంఝీని ఆ పదవి నుంచి దింపేసి తిరిగి నితీశ్ సీఎం బాధ్యతలు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News