: బీహార్ ఎన్నికల్లో హైలైట్స్ ఇవే!


ఈ రోజు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నజీమ్ జైదీ మీడియాతో మాట్లాడారు. బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ ఎన్నికల హైలైట్స్ గురించి ఆయన ప్రస్తావించారు. వాటి వివరాలు... * అధిక సంఖ్యలో మహిళా ఓటర్లు తమ పేరు నమోదు నిమిత్తం గత ఏప్రిల్ లో ఈసీ ప్రణాళిక రచించడంతో, ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. * 2010తో పోలిస్తే ఈసారి 50 లక్షల మంది మహిళా ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు (గతంలో 1.4 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 1.9 కోట్లు) * అత్యంత కట్టుదిట్టంగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది * అక్రమ మద్యం సరఫరా, డబ్బు వెదజల్లకుండా భారీ నిఘా పెట్టడం జరిగింది * భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ, నకిలీ డబ్బు స్వాధీనం చేసుకున్నారు * తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది * ఎటువంటి హింసాత్మక ఘటనలు, రక్తపాతం చోటుచేసుకోకపోవడం విశేషం * కేవలం రెండు చోట్ల మాత్రమే రీ పోలింగ్ కు ఆదేశించడం జరిగింది * 2010, 2015 ఓటర్ల డేటాను పోల్చి చూస్తే, అదనంగా 1.2 కోట్ల మంది ఓటర్లు కొత్తగా వచ్చి చేరారు * ఎలక్షన్ ఉద్యోగుల టీమ్ వర్క్ విజయవంతమైంది * కొన్ని రాజకీయ పార్టీలు తమ ఏజెంట్లను బూత్ లెవెల్లో నియమించడం ద్వారా ఓటర్లకు అవగాహనతో పాటు సరైన సమాచారం లభించింది.

  • Loading...

More Telugu News