: బీజేపీ ఓటమి మోదీ పనితీరుకు నిదర్శనం... కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
బీహార్ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఓటమి దిశగా పయనిస్తోంది. మొత్తం 243 స్థానాలకు గాను కేవలం 73 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉన్న బీజేపికి పరాజయం దాదాపు ఖరారైంది. బీజేపీకి చెక్ పెట్టేందుకు నితీశ్ కుమార్ మహా కూటమి పేరిట ఆర్జేడీ, కాంగ్రెస్ లతో జట్టు కట్టారు. నేటి ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో మహా కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. నితీశ్ కుమార్ గెలుపు దాదాపుగా ఖరారైంది. ఈ నేఫథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. బీహార్ లో బీజేపీ ఓటమి ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.