: తొలి విజయం ‘లాలూ’దే!... బనియాపూర్ లో ఆర్జేడీ అభ్యర్థి గెలుపు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం వెలువడింది. మహా కూటమితో బరిలోకి దిగిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు. బీజేపీ నేతలు, ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు దీటైన సమాధానాలిచ్చిన ఆయన తనదైన శైలిలో దూసుకుపోయారు. దాదాపు 200లకు పైగా ర్యాలీల్లో పాల్గొన్న లాలూ ప్రసాద్ శ్రమ ఫలించింది. ఎన్నికల్లో వెలువడిన తొలి ఫలితం లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీ ఖాతాలోనే పడింది. బనియాపూర్ లో ఆర్జేడీ అభ్యర్థి కేదార్ నాథ్ సింగ్ ఘన విజయం సాధించారు. ఇక రెండో ఫలితం కూడా మహా కూటమికి చెందిన కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఇప్పటిదాకా ఫలితం వెలువడ్డ రెండు స్థానాలు కూడా మహా కూటమి ఖాతాలోనే పడ్డాయి.