: బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన నితీశ్ కుమార్
మహా కూటమికి దక్కనున్న విజయంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. బీహార్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన తనకు దక్కనున్న విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. మహా కూటమికి బీహారీలు మద్దతివ్వడమే కాక సంపూర్ణ మెజారిటీ కట్టబెట్టారని ఆయన పేర్కొన్నారు. తద్వారా మహా కూటమిని బీహారీలు ఆశీర్వదించారని ఆయన వ్యాఖ్యానించారు.