: అద్వానీకి మోదీ బర్త్ డే విషెస్... ఇంటికెళ్లి శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని


బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ నేటితో 88 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అద్వానీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీనియర్ నేతకు శుభాకాంక్షలు తెలిపారు. నేటి ఉదయం నేరుగా అద్వానీ ఇంటికి వెళ్లిన మోదీ, ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా అద్వానీని మోదీ ఆకాశానికెత్తేశారు. అద్వానీ తనకు మార్గదర్శకుడని మోదీ కీర్తించారు. అద్వానీకి భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కూడా మోదీ ఆకాంక్షించారు. దేశానికి అద్వానీ ఎనలేని సేవలు అందించారని కీర్తించారు. తొలుత ట్విట్టర్ లో అద్వానీకి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేసిన మోదీ, ఆ తర్వాత నేరుగా అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News