: పుడుతూనే రికార్డులు తుడిచేసి...కొత్త రికార్డు సృష్టించిన చబ్బీ బేబీ!


భారతదేశంలో సాధారణంగా పిల్లలు రెండున్నర కేజీల నుంచి మూడు కేజీల మధ్య బరువుతో జన్మిస్తారు. మూడు కేజీలను మించి పుడితే బరువైన బిడ్డగానే పరిగణిస్తారు. ఎక్కడో అడపాదడపా తప్ప 5 కేజీల బరువుతో బేబీ జన్మించడం అరుదే. అలాంటిది గత నెలలో రాజస్థాన్ లో ఆరు కేజీల బరువుతో పుట్టిన ఓ శిశువు పాత రికార్డులు తుడిచేశాడు. ఇప్పుడు ఆ రికార్డును కూడా ఓ శిశువు తుడిచిపెట్టేశాడు. మధ్యప్రదేశ్ లోని ఓరిలో ఓ మహిళ ఏడు కేజీల బరువున్న శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆమె ప్రసవ సమయంలో కానీ, తరువాత కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటి అరుదైన ఘటనల్లో జన్యులోపాల వల్ల ఇలాంటి బేబీ పుట్టిందని చెప్పే వైద్యులు కూడా ఆశ్చర్యపోయేలా పుట్టిన బేబీ పూర్తి ఆరోగ్యంగా ఉండడం విశేషం. దీంతో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టేసిన ఈ బేబీ కొత్త రికార్డు నెలకొల్పింది.

  • Loading...

More Telugu News