: సల్మాన్ ఖాన్ నా తల్లిదండ్రులను వెతకడంలో సాయం చేస్తాడు: గీత
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను బధిర యువతి గీత త్వరలో కలవనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన తల్లిదండ్రులను వెతకడంలో సల్మాన్ సహాయం చేస్తాడనే నమ్మకం ఉందని చెప్పింది. 'బజరంగీ భాయిజాన్' అనే చిత్రంలో పాకిస్థాన్ కి చెందిన బాలికకు ఆమె తల్లిదండ్రులను వెతికిపెట్టడంలో సల్మాన్ సాయం చేశాడు. అలాగే నిజజీవితంలోనూ తనకు సాయం చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె మోనికా పంజాబ్ వర్మ సాయంతో విలేకరులతో మాట్లాడింది. కాగా సల్మాన్ ను కలిసేందుకు ఆయన మేనేజర్ తో మాట్లాడుతున్నామని అక్కడి జిల్లా కలెక్టర్ తెలిపారు. త్వరలో సల్మాన్ ని గీత కలిసేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.