: తెలంగాణ పోలీస్ శాఖలో 9వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నిర్ణయం


తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకేసారి 9,056 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కారు అనుమతించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఈ క్రమంలో పోలీసు శాఖలో 8,360, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో 186, అగ్నిమాపక శాఖలో 510 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. కాగా, సివిల్ విభాగంలో కచ్చితంగా 33 శాతం మహిళలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News