: జమ్మూకాశ్మీర్ కు రూ. 80 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ


జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రధాని మోదీ భారీ ప్యాకేజీ ప్రకటించారు. ఈ రోజు శ్రీనగర్ లో బీజేపీ-పీడీపీ నిర్వహించిన ర్యాలీకి హాజరైన మోదీ అక్కడకు విచ్చేసిన భారీ జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. జమ్మూకాశ్మీర్ ను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పిన ప్రధాని... రూ. 80 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. గత ఏడాది రాష్ట్రంలో సంభవించిన వరదలు తనను ఎంతో బాధించాయని చెప్పారు. టూరిజాన్ని మళ్లీ పూర్వ స్థితికి తీసుకువస్తామని తెలిపారు. దీపావళిని ఢిల్లీలో స్నేహితులతో జరుపుకోవడం తనకు ఈజీ అని... కానీ, జమ్మూకాశ్మీర్ ప్రజలతో జరుపుకోవాలనే ఇక్కడకు వచ్చానని మోదీ తెలిపారు.

  • Loading...

More Telugu News