: 218 పరుగులా? 10 వికెట్లా?... ఆసక్తికరంగా మారిన భారత్, సౌతాఫ్రికా మ్యాచ్!


దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఫలితం తేలే దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో 201 పరుగులకు ఆలౌటై, ఆపై దక్షిణాఫ్రికాను 184 పరుగులకు కుప్పకూల్చిన ఇండియా రెండో ఇన్నింగ్స్ లో సైతం పేలవమైన ప్రదర్శనతో 200 పరుగులకు ఆలౌటైంది. భారత ఆటగాళ్లలో పుజారా మినహా ఎవరూ రాణించలేదు. చివరి 8 వికెట్లనూ కేవలం 39 పరుగుల తేడాలో భారత్ చేజార్చుకుంది. ఇక దక్షిణాఫ్రికా ముందు 218 పరుగుల లక్ష్యం ఉండగా, భారత్ 10 వికెట్లు తీయగలిగితే విజయం సాధిస్తుంది. అనుభవజ్ఞులైన సౌతాఫ్రికా ఆటగాళ్లు ఆ స్కోరును సాధించి భారత్ పై విజయం సాధిస్తారో లేక తొలి ఇన్నింగ్స్ లో మాదిరిగానే కుప్పకూలుతారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

  • Loading...

More Telugu News