: నామినేషన్ల తరువాత పరిస్థితి మాకు అనుకూలంగా మారింది: ఎర్రబెల్లి


వరంగల్ లోక్ సభకు నామినేషన్లు వేసిన తరువాత పరిస్థితి తమకు అనుకూలంగా మారిందని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అయితే బీజేపీ అభ్యర్థని పోటీలో పెట్టినందుకు టీడీపీ కార్యకర్తలు నిరాశ చెందారని ఓ తెలుగు చానల్ తో మాట్లాడుతూ చెప్పారు. వరంగల్ స్థానంలో గెలుపోటముల బాధ్యత తనదేనన్న ఆయన, ఉప ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రచారానికి వస్తే కేడర్ లో ఉత్సాహం వస్తుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ ను ఓడించేందుకు ప్రజలు కసితో ఉన్నారని, అటు ప్రస్తుత తాజా పరిణామాలు కాంగ్రెస్ ను దెబ్బతీశాయని ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News