: పిల్లల కోసమే నేను... ఎంతకైనా తెగిస్తా: పోలీసులతో పదేపదే చెప్పిన సారిక!


"నన్ను హింసిస్తున్నారు. భరిస్తున్నా... చిన్న పిల్లలని కూడా చూడకుండా నా కొడుకులను బాధిస్తున్నారు. దీన్ని మాత్రం సహించను. పిల్లల కోసం ఎంతకైనా తెగిస్తాను. నా భర్త అనిల్ ను, మామ సిరిసిల్ల రాజయ్యను, అత్త మాధవిని విడిచి పెట్టబోను" అని గతంలో పోలీసులకు సారిక పలుమార్లు చెప్పిందట. ఆమె తన ఆవేదను ఎన్నోమార్లు తమతో పంచుకుందని పోలీసులు నాటి ఘటనలను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. తమ వంశాంకులే అన్న ఆలోచన కూడా లేకుండా, పిల్లలకు జ్వరం వచ్చి, మందులు కొనేందుకు డబ్బు లేదని అడుక్కున్నా వారు చలించలేదని సారిక చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. అడుక్కుతిని బతకాలని రాజయ్య తనకు సలహా ఇచ్చాడని కూడా ఆమె వాపోయారని ఓ మహిళా ఎస్సై కళ్లల్లో నీరు తిరుగుతున్న పరిస్థితిలో వెల్లడించారు. సారిక ఎంతో మంచిదని, ఎన్నో బాధలు అనుభవించిందని, ఆమె, ముగ్గురు చిన్నారుల మరణాన్ని తట్టుకోలేకపోతున్నామని ఆ మహిళా పోలీసు అధికారి వివరించారు.

  • Loading...

More Telugu News