: నిద్రిస్తున్న వారికి ఆ లారీయే మృత్యువు!
తమ ఇంట్లో ఆదమరచి నిద్రిస్తున్న వారిని మృత్యువు ఓ లారీ రూపంలో వచ్చి కబళించింది. ఈ ఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో జరిగింది. వేగంగా వస్తూ, అదుపుతప్పిన ఓ లారీ రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. లారీ బ్రేకులు ఫెయిల్ కావడమే ఘటనకు కారణమని తెలుస్తోంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. లారీ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం వెలువడాల్సివుంది.